వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా మనోగతం వెల్లడి, తెలంగాణకు వ్యతిరేకమే

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మనోగతం స్పష్టమైంది. ఆమె తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా లేరనే విషయం పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ మాటల ద్వారా తేలిపోయింది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్న వెంటనే ఆజాద్ తెలంగాణపై పలు వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ అధిష్టానం వ్యతిరేకంగా ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. ఆజాద్ మాటల్లో సోనియా అభిమతం వ్యక్తమైందని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమస్య కాదని, దేశ సమస్య అంటూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్‌ను ఆయన ముందు పెట్టారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు, కావూరి సాంబశివ రావు వంటి సీమాంధ్ర నాయకులు ఇదే వాదనను ముందు పెడుతున్నారు. అంతేకాకుండా, మూడు ప్రాంతాల ప్రజల, నాయకుల అభిప్రాయం కూడా కావాలని ఆజాద్ అన్నారు. ఇప్పటికే శ్రీకృష్ణ కమిటీ నివేదిక అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాన్ని సేకరించిందనే విషయాన్ని ఆయన పక్కన పెట్టారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తామని అంటూ రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజల సెంటిమెంటును కూడా గౌరవిస్తామని చెప్పారు. ఇది కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పినట్లే.

అయితే, కాంగ్రెసు అధిష్టానానికి పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులను దారికి తెచ్చుకోలమనే ధీమా ఉందని భావించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు డెడ్‌లైన్లు విధిస్తూ వెనక్కి తగ్గుతూ వస్తున్నారు. ఈసారి కూడా వారు అదే విధంగా రాజీనామాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తూ ఉండవచ్చు. తెలంగాణ ప్రజలకు కూడా కాంగ్రెసు తమ ప్రాంత రాజకీయ నాయకులపై నమ్మకం లేదు. రాజీనామాలు చేస్తామని ప్రకటించినప్పటికీ దానికి ఎంత మంది కట్టుబడి ఉంటారనేది కూడా అనుమానమే. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామా చేయరనే నమ్మకంతోనే తాము కూడా రాజీనామా చేస్తామని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ప్రకటించి ఉంటారని కూడా అనుకుంటున్నారు.

English summary
It is clear that Congress party president Sonia Gandhi is against for formation of Telangana state. Ghulam Nabi Azad words revealed Sonia Gandhi's opinion on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X