హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోమవారమే ప్రజాప్రతినిధుల రాజీనామా: టి-కాంగ్రెసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు శుక్రవారం టి-కాంగ్రెసు నేతల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు అందరూ సోమవారం ఉదయం 11 గంటలకు రాజీనామాలు సమర్పిస్తారని మంత్రి జానారెడ్డి సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రాజీనామాలను నేరుగా స్పీకర్‌కే ఇస్తామని చెప్పారు. ప్రజాభీష్టానికి తలవంచి తాము రాజీనామాలకు సిద్ధపడ్డామని అన్నారు. శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రులు రాష్ట్రంలో స్పీకర్‌కు, పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో స్పీకర్‌కు నేరుగా రాజీనామాలు ఇవ్వనున్నారని చెప్పారు. ఇన్నాళ్లూ తాము ప్రజాస్వామ్యబద్దంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని అనుకున్నామని అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ దిగి రాక పోవడంతో తాము రాజీనామాలకు సిద్ధపడ్డామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. తాము పదవులు వదులు కోవడం లేదని కొందరు ఆరోపణలు చేశారని అయితే ప్రజాస్వామ్యబద్దంగా ఉండటం కోసమే ఇన్నాళ్లూ ఓపిక పట్టామని చెప్పారు. కేంద్రం ఇప్పటికీ స్పందించక పోవడంతో తాము చేసేది లేక రాజీనామాలకు సిద్ధపడ్డామని అన్నారు. తమ రాజీనామాలతో తమపై ఆరోపణలు చేసిన వారి ఉద్దేశ్యం పటాపంచలు చేశామని అన్నారు. రాజీనామాకు కట్టుబడి మా మాటను మేం నిలబెట్టుకుంటున్నామని అన్నారు. ఆస్తులు, ప్రాణాలు నష్టం కాకుండా తాము ఇన్నాళ్లూ ఉద్యమించామని చెప్పారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. పదవుల కోసం తాము సాకులు చెప్పడం లేదన్నారు. తెలంగణ కోసం పదవులు త్యాగం చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు.

రాజీనామాలకు సిద్ధపడ్డ తర్వాత వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కె కేశవరావు అన్నారు. తాము నేరుగా సభాపతులకే రాజీనామాలు అందజేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజీనామాలు అయినా ఆమోదించాలి. లేదా తెలంగాణ అయినా ప్రకటించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ కోసం టి-కాంగ్రెసు నేతలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. పదవుల కోసం తాము ఎప్పుడూ లాలూచీ పడలేదన్నారు. మా పార్టీ నేతల నుండి ఈ స్పందన వస్తుందని తాను ఊహించలేదని అన్నారు. తాము ఢిల్లీలో రాజీనామా సమర్పిస్తామని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

English summary
T-congress leaders were taken decision to resign for their posts on monday of July. They met today at Nampally exibhition ground and decided to resign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X