తెలంగాణ కోసం రాజీనామాలపై వెనక్కి తగ్గం: కెకె

K Keshav Rao
హైదరాబాద్‌: తెలంగాణ కోసం రాజీనామాలు చేయాలనే తమ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. కేశవ రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటే మాత్రమే రాజీనామాల నిర్ణయానికి వెనక్కి తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు వివేక్, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథంలతో తన నివాసంలో సమావేశమైన అనంతరం ఆయన శనివారం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. న్యాయం గెలుస్తుంది, తెలంగాణ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారంనాటి సమావేశానికి సగం మంది తమ పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులు సగం మంది వచ్చారని, ఎంపి మధుయాష్కి వంటి కొంత మంది అమెరికాలో ఉన్నారని, అందువల్ల రాలేకపోయారని ఆయన చెప్పారు.

సమావేశానికి రాని ప్రజాప్రతినిధులతో, రాజీనామాలకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులతో తాను మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి మీతో కలిసి వస్తారా అని అడిగితే తెలంగాణ ఉద్యమానికి ఏ ఒక్క కథానాయకుడో లేడని, ప్రజలే నడిపిస్తారని సమాధానమిచ్చారు. సిపిఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు చేశాయని, ఎనిమిదేళ్లుగా సంప్రదింపులు జరిగాయని ఆయన అన్నారు. 2004 ఎన్నికల్లో తెలంగాణపై ఒప్పందం చేసుకునే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోటీ చేశామని, ఆ విషయం గులాం నబీ ఆజాద్‌కు తెలుసునని ఆయన అన్నారు.

రేపు తాము ఢిల్లీకి వెళ్తున్నామని, ఎల్లుండి సోమవారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌కు రాజీనామాలు సమర్పిస్తామని ఆయన చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకే తాము రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతామని ఆయన అన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలనేది తమ అభిమతం కాదని, తెలంగాణను సాధించుకోవడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు విడిపోయే హక్కు తమకు ఉందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ మీద పోటీ చేస్తారని అడిగితే, ప్రజల ఆకాంక్ష మేరకే ఉంటుందని, తాను కాంగ్రెసులోనే ఉంటానని, తాను కాంగ్రెసువాదినని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+