రాజీనామాలకు నలుగురు తెలంగాణ మంత్రులు నో

కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణకు చెందిన మంత్రులు కె. జానారెడ్డి, సారయ్య సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాజీనామాలు చేయడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. లోక్‌పాల్ బిల్లు ముసాయిదాపై చర్చల్లో తీరిక లేకుండా ఉన్న కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ ప్రాంత పార్టీ పార్లమెంటు సభ్యులతో ఇప్పటి వరకు మాట్లాడలేదు. రేపు సోమవారం ఉదయం మాట్లాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల్లో 22 మంది దాకా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఏడెనిమిది మంది సమయానికి రాజీనామాలు చేయడానికి ముందుకు రావచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications