వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై కూల్‌గా స్పందించిన చిదంబరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

P Chidambaram
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంశంపై కేంద్రమంత్రి చిదంబరం అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధుల రాజీనామా తర్వాత సైతం ఆయన అంతగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించడం లేదు. సోమవారం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్రం అంశంపై ఇంకా నిర్ణయమే తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుల రాజీనామాలు తమను ఏమీ ఆశ్చర్యం కలిగించలేదన్నారు. రాజీనామాల వల్ల తలెత్తిన పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని అన్నారు. తెలంగాణపై సంప్రదింపులు కొనసాగుతాయని అన్నారు.

సంప్రదింపుల తర్వాతే స్పష్టమైన ప్రకటన ఉంటుందన్నారు. ఏకాభిప్రాయం కుదిరే వరకు సంప్రదింపులు కొనసాగుతాయన్నారు. అఖిలపక్షం నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయం తెలుసుకుంటామని చెప్పారు. డిసెంబర్ 9 ప్రకటనను ప్రశ్నించే వారు డిసెంబర్ 23 ప్రకటనను కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల రాజీనామాలపై తాను స్పందించనన్నారు. అది ఆ పార్టీకి సంబంధించిన అంశమన్నారు. అఖిలపక్ష సమావేశంలో వారి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇంకా రెండు పార్టీలు తమ అభిప్రాయం చెప్పాల్సి ఉందన్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయమే తీసుకోలేదని అన్నారు. మీడియానే సృష్టిస్తుందన్నారు. నిర్ణయం తీసుకునే వరకు అందరూ సహనం వహించాలన్నారు. ముఖ్యంగా మీడియా సహనం వహించాలని సూచించారు.

వర్షాకాల సమావేశాల్లో లోక్ పాల్ బిలవ్లు పెడతామని చెప్పారు. లోక్ పాల్ బిల్లును సత్వరమే ఆమోదింపజేసేలా చూస్తామని అన్నారు. లోక్ పాల్ బిల్లుపై రాజ్యాంగాన్ని తిరగరాయడం కాదని రాజ్యాంగానికి లోబడే లోక్ పాల్ బిల్లు ఉంటుందని అన్నారు. బిల్లుపై అఖిలపక్ష సమావేశం సజావుగానే సాగిందని అన్నారు. అఖిలపక్ష నేతలు తమ సూచనలు సూచించారని, ప్రధానిని లోక్ పాల్ పరిధిలోకి తీసుకు రావాలని సూచించారని అన్నారు. యూపిఏ ఒక రాజకీయపార్టీ కాదని రాజకీయ పక్షాల కూటమి అని అన్నారు. లోక్ పాల్ పై అవాంతరాలు అధిగమిస్తామని అభిప్రాయపడ్డారు. ముసాయిదా బిల్లును సంబంధింత మంత్రులు తయారు చేశారని, దీనిని మొదట మంత్రివర్గ ఉపసంఘం దీనిని పరిశీలించాలని ఆ తర్వాతే కేంద్రమంత్రివర్గ పరిశీలనకు వెళుతుందన్నారు. బిల్లుపై వివిధ దశల్లో పరిశీలన ఉంటుందని చెప్పారు. బిల్లు కేవలం లోక్ పాల్ పౌర సమాజ సభ్యులకే కాకుండా అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని అన్నారు. ఆగస్టు 6 నుండి అన్నహజారే దీక్ష చేస్తారని ముందుగానే ఊహించడం తగదన్నారు.

English summary
Union Minister Chidambaram said today that central government will produce lokpal bill in next parliament session. Chidambaram not respond very serious on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X