వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ పర్యటనపై జానారెడ్డితో విభేదిస్తున్న కోమటిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Komatireddy Venlat Reddy
హైదరాబాద్: ఢిల్లీ పర్యటనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డితో విభేదిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై అధిష్టానం నుండి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఢిల్లీ వెళ్లవద్దనే ఆలోచనలో కోమటిరెడ్డి ఉండగా, జానారెడ్డి మాత్రం ఢిల్లీ బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లడం వృథాయే అని కోమటిరెడ్డి భావిస్తున్నారు. ఢిల్లీ వెళ్లడం వల్ల లాభం లేదని ఆయన తన సహచరులతో కూడా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాతే ఢిల్లీ వెళితే బావుంటుందని కోమటిరెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కోమటిరెడ్డి మాట్లాడారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేయని వారిని తెలంగాణ ద్రోహులుగా పరిగణిస్తామని చెప్పారు.

2009 డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇప్పుడు రాకపోతే మరెప్పుడూ రాదన్నారు. మీడియా అనవసరంగా టి-కాంగ్రెసును రెచ్చగొడుతుందని అది సరికాదన్నారు. తెలంగాణ నుండి 11 మంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పారు. తెలంగాణ ఇచ్చే వరకు తాము రాజీనామా ఉపసంహరించుకునే ప్రసక్తి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పక్కన పెట్టాలని సూచించారు. టిడిపి నేతలతో తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణ వచ్చే వరకు సామాన్య కార్యకర్తగా సోనియా పోటోతో తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. తెలంగాణ ఇవ్వడమా, రాజీనామాలు ఆమోదించడమా అధిష్టానం ముందు రెండో ఉన్నాయని జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రజలు, నేతలకు ఆత్మగౌరవం ఉందన్నారు. సోనియాపై నమ్మకం ఉందని చెప్పారు.

English summary
Komatireddy Venkat Reddy was opposed Jana Reddy Delhi tour. Komatireddy thinking that delhi tour after high command perfect statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X