చంద్రబాబు ఓకె అంటే తెలంగాణ వస్తుంది: నాగం

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి చిదంబరానికి లేఖ రాస్తే వెంటనే తెలంగాణ వస్తుందని, తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకోకుండా చంద్రబాబే తెలంగాణకు అడ్డుపడుతున్నాడని తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరింపబడిన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మాట్లాడుతూ ధ్వజమెత్తారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా ఏ కార్యక్రమం చేపట్టినా ఫలితం ఉండదన్నారు. టిడిపి తెలంగాణ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం కూడా తన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబే తెలంగాణకు ప్రధాన అడ్డంకి అన్నారు. చంద్రబాబు తన వైఖరి ప్రకటిస్తే వెంటనే కేంద్రం తెలంగాణ ప్రకటిస్తుందన్నారు.

చంద్రబాబు ఇరు ప్రాంతాల నేతలతో నాటకాలు ఆడించడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలే తెలంగాణ నేతల అధిష్టానం అన్నారు. తెలంగాణ సాధనకు తెలంగాణ మొత్తం ఏకమై కదలుతోందన్నారు. తమ రాజీనామా సెగలు ఢిల్లీకి తగిలాయన్నారు. కొంతమంది తెలంగాణ ద్రోహులు తప్పించి మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామా చేశారని అన్నారు. రాజీనామా చేయని వారిపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. రాజకీయ సంక్షోభంతోనే తెలంగాణ వస్తుందన్నారు. హైదరాబాదులో తెలంగాణ వాదం లేదనే విషయం అవాస్తవమన్నారు. తమ దీక్షకు రాజధానిలోని అన్ని ప్రాంతాల నియోజకవర్గాల నుండి ప్రజలు వచ్చారని అన్నారు.

కేంద్రమంత్రి చిదంబరం చేసిన ప్రకటన సరికాదన్నారు. ఆయన తన ధోరణి మార్చుకోవాలన్నారు. లేదంటే తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారన్నారు. 1972లో జై తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికి జై ఆంధ్ర ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సహించిందన్నారు. చిరంజీవితో కలవడానికి రక్షణ శాఖ మంత్రిని పంపిన అధిష్టానం తెలంగాణలో ఇంతమంది రాజీనామాలు చేస్తే పట్టించుకోక పోవడం బాధాకరం అన్నారు. మా నియోజకవర్గాల్లో పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటే ఊరుకునేది లేదన్నారు. మేం చట్టాలు చేసే వాళ్లమని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కబడ్దార్ అంటూ హెచ్చరించారు. విద్యార్థులపై కిరణ్ ప్రభుత్వం దమనకాండను ఆపాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+