ఒత్తిడితో జైపాల్ రెడ్డి రాజీనామా చేస్తారా?

మల్కాజిగిరి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ ఇంటిని కూడా తెలంగాణ ఆందోళనకారులు ముట్టడించారు. శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి కాన్వాయ్‌ని ఆందోళనకారులు హైదరాబాదులోని బల్కంపేట వద్ద అడ్డుకున్నారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ఇంటి వద్ద తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లాలో శాసనసభ్యుడు రేగా కాంతారావు శవయాత్ర నిర్వహించారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లు ఒయు విద్యార్థులు హెచ్చరికలు జారీ చేశారు.
పార్టీ అధిష్టానం ఆలోచన పసిగట్టి జైపాల్ రెడ్డి రాజీనామా చేయడానికి వెనకాడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సమయం చూసి ముందుకు వస్తారా అనేది కూడా చెప్పలేని స్థితి. సమయం వచ్చినప్పుడు తాను రాజీనామా చేస్తానని, కేంద్ర మంత్రిగా ఉండడం వల్ల ఇప్పుడు రాజీనామా చేయలేని జైపాల్ రెడ్డి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులతో చెప్పారు.












Click it and Unblock the Notifications