వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉస్మానియాలో తుపాకుల మోత, పోలీసుల ఆకృత్యం

ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు బి-హాస్టల్ వద్ద టియర్ గ్యాస్ ప్రయోగించారు. 10 రౌండ్ల సౌండ్ బుల్లెట్లు ప్రయోగించి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా రబ్బరు బుల్లెట్లు తగిలి ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థులు ఉస్మానియా పోలీసు స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. దీంతో ఓయులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 14ఎఫ్ రద్దు కోసం దీక్ష చేస్తున్న ఆరుగురు విద్యార్థుల్లో శేఖర్, మురళి అనే ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారికి అక్కడే అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు నచ్చజెప్పి దీక్షను విరమింప జేసేందుకు వెళ్లిన నాగం జనార్దన్ రెడ్డిని పోలీసులు గేటు ముందే ఉదయం అడ్డుకున్నారు. ఆ తర్వాత వచ్చిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను సైతం అడ్డుకొని అరెస్టు చేశారు.