కాంగ్రెసే దోషి: హైకమాండ్‌పై పొన్నం తిరుగుబాటు

 Ponnam Prabhakar
కరీంనగర్: కాంగ్రెసు పార్టీపై ఆ పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆలస్యంలో ప్రముఖ ముద్దాయి కాంగ్రెసు పార్టీయే అని ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ బుధవారం కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే వారిలో కాంగ్రెసు నాయకులే ముఖ్యులన్నారు. కాంగ్రెసు పార్టీయే తెలంగాణకు తొలి అడ్డంకిగా నిలిచిందని ఆవేశంగా అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాలకు సంఘీభావంగా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సైతం తమ తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై ప్రస్తుతం ఉన్న ఆవేశం ఆక్రోశంగా మారక ముందే కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల స్థాపించిన వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని ఆ పార్టీ జెండా తెలంగాణలో ఉండకుండా చూడాలని అన్నారు.

కాగా తాను కాంగ్రెసు పార్టీ దోషి అనలేదని ప్రజల అభిప్రాయం అది అని తాను చెబుతున్నానని ఓ టీవి ఛానల్లో మాట్లాడుతూ అన్నారు. ఆ దోషిత్వాన్ని తొలగించుకోవడానికే తాము అధిష్టానంతో పోట్లాడుతున్నామన్నారు. తెలంగాణ ఇస్తుందని కాంగ్రెసు పార్టీపై నమ్మకం ఉందన్నారు. అందరి సహకారంతో తెలంగాణ సాధిస్తామని చెప్పారు. మీడియా కథనాలు ప్రసారాలు చేయడంలో సంశయమనం పాటించాలని సూచించారు. అవాస్తవ విషయాలు పక్కన పెట్టి మీడియా నిజాలు చెప్పాలన్నారు. కాంగ్రెసు పార్టీని అగౌరవపరిచే విధంగా తాను మాట్లాడలేదన్నారు. కాగా పొన్నం రాజీనామా ప్రతిపాదనలపై టిఎన్జీవో నేత దేవిశ్రీ ప్రసాద్ స్పందిస్తూ ప్రజల నుండి డిమాండు వచ్చినప్పుడు స్పందిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+