రాష్ట్రపతి పాలన దిశగా కాంగ్రెసు కదలిక

Congress
న్యూఢిల్లీ‌‌: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాష్ట్రపతి పాలన దిశగా కదులుతున్నట్లు అర్థమవుతోంది. కాంగ్రెసు అధిష్టానం ఆ దిశగానే పావులు కదుపుతున్నట్లు సమాచారం. తమకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరోటి వద్దని తెలంగాణ కాంగ్రెసు నాయకులు తేల్చి చెప్పడంతో అధిష్టానం ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సంప్రదింపులకు తాము వ్యతిరేకం కాదని, అయితే రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించి సంప్రదింపులు జరపాలని, ఆ సంప్రదింపులు రాష్ట్ర విభజన కోసమే జరగాలని తెలంగాణ నాయకులు పార్టీ అధిష్టానానికి చెబుతున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెసు ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేదు.

కాగా, తమ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుల వద్ద కాంగ్రెసు అధిష్టానం నాలుగు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. వాటిలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్, రాష్ట్రపతి పాలన అనే రెండు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును తాము అంగీకరించే ప్రసక్తి లేదని తెలంగాణ నాయకులు అంటున్నారు. దీంతో నాలుగో ప్రతిపాదన రాష్ట్రపతి పాలనే అంతిమం కానుందనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌పై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.

తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు అధిష్టానం మళ్లీ మొదటికి తెచ్చింది. శ్రీకృష్ణ కమిటీని వేసి నివేదిక తెప్పించుకున్న తర్వాత, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత, అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా మళ్లీ ఏకాభిప్రాయ సాధన, విస్తృత స్థాయి సంప్రదింపులు అని అధిష్టానం అనడాన్ని తెలంగాణ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+