వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేంద్రమంత్రి పదవికి దయానిధి మారన్ రాజీనామా

ప్రాథమికంగా నేరారోపణ రుజువైనందున విచారణలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకే మారన్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా నిర్ణయానికి ముందు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. శివశంకర్ అనే వ్యాపారికి చెందిన ఎయిర్ సెల్‌ను బలవంతంగా మలేషియాకు చెందిన మాక్సిస్ కంపెనీకి అమ్మేలా మారన్ ఒత్తిడి శివశంకర్‌పై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. శివశంకర్ సైతం మారన్ తనను ఎయిర్ సెల్ అమ్మాలని తీవ్ర ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఎయిర్ సెల్ శివశంకర్ నుండి మాక్సిస్‌కు ఇప్పించేందుకు మారన్‌కు భారీగానే ముడుపులు అందాయనే ఆరోపణలు ఉన్నాయి.