వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూరు జిల్లాలో మంత్రి జైపాల్ రెడ్డి శవయాత్రలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy
మహబూబ్‌నగర్: కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డిపై ఆయన సొంత జిల్లా మహబూబ్‌నగర్ జిల్లాలో నిరసన జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. మంత్రి పదవిని అంటి పెట్టుకుని ఉండడంపై జిల్లాలో ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. శవయాత్రలు నిర్వహించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుధవారం ప్రారంభమైన నిరసన వెల్లువ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఆయన స్వగ్రామం మదుగల్‌లో కూడా శవయాత్ర నిర్వహిచారు. రాజీనామా చేయకపోతే జైపాల్ రెడ్డిని తెలంగాణ ద్రోహిగా పరిగణిస్తామని అంటున్నారు.

జిల్లాలోని కొడంగల్, కొల్లాపూర్, ధరూర్, వీపెనగండ్ల, నారాయణపేట్, కొత్తూరు, కేశంపేట మండలాల్లో పెద్ద యెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. తెలంగాణ ఆందోళనకారులు ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. శవయాత్రలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో ఆయనకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా ఆయనకు వ్యతిరేకంగా నినదించారు. జైపాల్ రెడ్డిపై మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అగ్రనేతల వరుసలో ఉన్న జైపాల్ రెడ్డి తమ పదవికి రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. రాజీనామా చేయకపోతే ప్రజలు జైపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.

English summary
While the Centre is caught in a cleft stick on the emotive Telangana issue, resentment against 'Mahbubnagar muddu bidda' S Jaipal Reddy is growing by the day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X