యుపిలో కాంగ్రెసు ఎంపి, మాజీ క్రికెటర్ అజరుద్దీన్ అరెస్టు
National
oi-Pratapreddy
By Pratap
|
మొరాదాబాద్: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్‌ను, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెటర్ మొహ్మద్ అజరుద్దీన్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారంనాడు అరెస్టు చేశారు. హింస చెలరేగిన మొరాదాబాద్‌లోని గ్రామానికి వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హింస చెలరేగడంతో ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించింది. ములాయం సింగ్ యాదవ్‌ను ఢిల్లీ - ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఘజియాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, అజరుద్దీన్‌ను మొరాదాబాద్‌లో అరెస్టు చేశారు. మొరాదాబాద్ నుంచి అజర్ లోకసభకు ఎన్నికయ్యారు. అసత్‌ల్పూరు గ్రామానికి వెళ్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
గ్రామంలోని ఓ మహిళ పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు హింసకు దిగారు. తనను పోలీసులు అక్రమంగా ఆరెస్టు చేశారని ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి మాయావతి రాజకీయ నాయకుల గొంతును నొక్కుతున్నారని ఆయన విమర్శించారు. నిషేధాజ్ఞలు ఉన్నందు వల్లనే ములాయం సింగ్ యాదవ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Samajwadi Party chief Mulayam Singh Yadav and Congress MP Mohammad Azharuddin were on Thursday detained by Uttar Pradesh police while they were on their way to a violence-hit village in Moradabad where restrictions are in force.
Story first published: Thursday, July 7, 2011, 12:20 [IST]