వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి సీమాంధ్ర నేతల వ్యూహాత్మక మౌనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Devineni Uma Maheswar Rao
హైదరాబాద్: విభజన కోరుతూ తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై తెలుగుదేశం సీమాంధ్ర నేతలు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. తెలంగాణలో కోల్పోయిన ప్రజాదరణను రాజీనామాలతో తిరిగి పొందే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సూచన మేరకు ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ తగిన సమయంలో ముందుకు రావాలనే యోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. తాము చేపట్టాల్సిన కార్యాచరణపై బుధవారం తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు చర్చించుకుని, చంద్రబాబును కలిశారు. అయితే, ప్రస్తుతానికి మౌనంగా ఉండాలని చంద్రబాబు వారికి సూచించారు.

తమ మౌనం రాష్ట్ర విభజనకు ఆమోదంగా తీసుకోకూడదని, తగిన సమయంలో తాము రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముందుకు వస్తామని తెలుగుదేశం నాయకుడు దేవినేని ఉమా మహేశ్వర రావు వంటివారు అంటున్నారు. అవసరమైతే తాము రాజీనామాలు చేస్తామని ఆయన అంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అడ్డుకోవడానికి వారు పెద్ద యెత్తున ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రజాప్రతినిదుల రాజీనామాల వల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తిరిగి ఆదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి రాజీనామాలను తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీని ఒంటరి చేయాలనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు వ్యూహం పని చేయని స్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు కూడా తమతో ఉంటారని తెలంగాణ జెఎసి నేత కోదండరామ్ చెప్పారు. దీంతో తెలంగాణలో వారికి వ్యతిరేకత ఉండదు. తెలంగాణపై చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నప్పటికీ రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధులను కాదనే పరిస్థితి లేకుండా పోయింది. తాజా పరిణామాలు తెలంగాణలో పార్టీకి ప్రయోజనకరంగా మారిన పరిస్థితిలో సీమాంధ్ర నేతలు మౌనంగా ఉండడం మంచిదని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.

English summary
While the mood in TDP Telangana leaders is upbeat over the good response they have been receiving from the people in the region following their resignation from the state assembly, the Seemandhra leaders are in a state of dilemma on whether to resign from the assembly and take recourse to agitations or wait for some more time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X