వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టౌన్ హాల్‌ ట్విట్టర్‌లో 'ఆస్క్ ఒబామా'లో ఒబామా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Barack Obama
బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ కంటే కూడా సామాజిక సోషల్ మీడియా సర్వీస్ అయినటువంటి ట్విట్టర్ ఉపయోగించే వ్యక్తిగా అందరికి బాగా సుపరిచితం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన అమెరికా ప్రెసిడెంట్ కావడానికి ట్విట్టర్ కూడా తన వంతు సహాయం అందించిందనే చెప్పుకోవాలి. ఎన్నికలకు ముందు బరాక్ ఒబామా ట్విట్టర్‌‍‌ని మీడియా సాధనంగా వాడడం జరిగింది. ఇటీవలే బరాక్ ఒబామా వివిధ అంశాలపై ప్రజల ప్రశ్నలకు బదులిచ్చేందుకు 'ఆస్క్ ఒబామా" పేరిట ట్విట్టర్ టౌన్ హాల్ సమావేశాన్ని ఒబామా ప్రారంభించారు.

ఆ సమావేశంలో ప్రజలు వారికి ఉన్న ఎటువంటి ప్రశ్నలను అయినా అమెరికన్ ప్రెసిడెంట్ ముందు ఉంచితే వారికి బరాక్ ఒబామానే స్వయంగా సమాధానం ఇవ్వడం జరగుతుంది. ప్రజలు అమెరికాకి సంబంధించి అన్ని రంగాలలో ప్రశ్నలు వేయవచ్చునని తెలిపారు. ఇలా మొదటి రోజు వచ్చినటువంటి 18 ప్రశ్నలకు బరాక్ ఒబామా కేవలం ఆరు ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారు.

అందుకు కారణం మిగిలిన ప్రశ్నలకు చెప్పేసమాధానం ట్విట్టర్‌లో చెప్పలేకపోవడమేనని తెలియజేశారు. ఈ సందర్బంలో బరాక్ ఒబామా మాట్లాడుతూ నాకు తెలుసు, నేను చెప్పవలసిన సమాధానాలు చాలా చిన్నవిగా ఉండాలి. అందుకే ఇందులో కేవలం కొన్నింటికి మాత్రమే సమాధానం చెబుతున్నానని అన్నారు. ఒహాయో స్పీకర్ జాన్ బోహ్నెర్ అడిగిన ప్రశ్నకు 'వైట్‌హౌస్"లో బుధవారం లైవ్ వెబ్‌కాస్ట్ ద్వారా సమాధానం ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాని మీరు ఈ ప్రక్క చిత్రంలో చూడవచ్చు.

ఆ తర్వాత వైట్ హౌస్ అధికార ప్రతినిధి జే కార్నే మాట్లాడుతూ బరాక్ ఒబామా స్వాతంత్య ప్రపంచానికే లీడర్ అని సంబోధించాడు. ఈ చర్య చేపట్టిన దేశ తొలి అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఖ్యాతిని గాంచారు. బరాక్ ఒబామా త్వరలో జరగనున్న అమెరికా ఎలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు.

English summary
US President Barack Obama got an avalanche of questions on Wednesday at a town hall forum through Twitter, the popular social media service.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X