తెలంగాణ సంప్రదింపుల అంశం కాదు: కె. కేశవరావు

రాజీనామాలు చేయడం కన్నా మించిన ఉద్యమం ఉండదని ఆయన అన్నారు. రాష్టాన్ని సాధించే వరకు పోరాడుతామని ఆయన అన్నారు. తాము నమ్మే విధంగానే కాకుండా ప్రజలు, న్యాయనిపుణులు నమ్మే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తేనే తాము రాజీనామాలను ఉపసంహరించుకుంటామని ఆయన చెప్పారు. తమను శంకించవద్దని, తమను కించపరచవద్దని, తమ వ్యవహారశైలినీ వ్యాఖ్యలనూ వక్రీకరించవద్దని ఆయన మీడియాను కోరారు. తాము తెలంగాణ రాజకీయ జెఎసిలో చేరబోమని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులతో సమన్వయం సాధించి ఉద్యమాన్ని ముందుకు తీసుకుని పోతామని ఆయన అన్నారు. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రకటించిన వైఖరిని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications