హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు అడిగే శక్తి ఉంది కదా: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ఇచ్చే శక్తీ తెచ్చే శక్తీ లేకపోవచ్చు గానీ అడిగే శక్తి ఉంది కదా అని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేసే శక్తి ఉందని, దాన్ని ఉపయోగించాలని తాము అంటున్నామని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని జగన్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు.

ఈనెల 13న తెలంగాణ ఉద్యోగసంఘాలు సమ్మె నోటీసు ఇస్తాయని, ఆగస్టు 1నుంచి సమ్మెకు దిగుతాయని కోదండరాం తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం జెఎసి స్టీరింగ్‌ కమిటీ భేటీ జరిగింది. అనంతరం ఆయన తమ నిర్ణయాలను తెలియజేశారు. ఆగస్టు 1నుంచి తెలంగాణ ఉద్యోగసంఘాలు సమ్మెకు దిగుతాయన్నారు. విద్యుత్‌, సింగరేణి ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈనెల 15నుంచి జెఎసి ఆధ్వర్యంలో సమావేశాలు, భారీ ర్యాలీలు జరుగుతాయన్నారు. తెలంగాణ నాయకత్వాన్ని విడగొట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

మంత్రులు రాజీనామాలు చేస్తే సరిపోదని విధులకు హాజరుకావద్దని ఆయన కోరారు. తెలంగాణపై ఖచ్చితమైన వైఖరి తెలపాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. సీమాంధ్ర సంపన్నవర్గాలు చేస్తున్న ఉద్యమాలను ఆపాల్సిన బాధ్యత తెలంగాణ తెదేపా నాయకులపై ఉందన్నారు. వారు చంద్రబాబు ఫోటో పక్కన జయశంకర్‌ ఫోటోను కూడా పెటుట్కఓవటం తమ మనస్సుకు కష్టంగా ఉందని ఆ విషయం వారు గ్రహించాలని కోరారు.

ఈ నెల 12వ తేదీన వంటావార్పూ, ఈ నెల 14వ తేదీన రైల్ రోకో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈసారి సమ్మె తీవ్రంగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని స్పందింపజేస్తామని ఆయన అన్నారు. అన్ని పార్టీలు కలిసి రావాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు ఈటెల రాజేందర్ కోరారు. కలిసికట్టుగా ఉద్యమించాలనే తాము తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నామని, కాంగ్రెసు పార్టీ కూడా కలిసి రావాలని ఆయన అన్నారు.

English summary
Telangana JAC chairman Kodandaram said that YSR Congress president YS Jagan has power to demand for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X