కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై స్పష్టంగా చెప్పని కొండా సురేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Surekha
కడప: ప్రసంగం చివరలో తెలంగాణ జై తెలంగాణ నినాదం ఇచ్చినప్పటికీ తెలంగాణకు అనుకూలంగా వైఖరి ప్రకటించాలని శాసనసభ్యురాలు కొండా సురేఖ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీలో స్పష్టం చేయలేదు. తెలంగాణ ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవం దెబ్బ తినకుండా తెలంగాణపై వైఖరి ప్రకటించాలని ఆమె పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. తెలంగాణలో పెద్ద యెత్తున వైయస్సార్ అభిమానులు ఉన్నారని, ప్రస్తుత ప్రాంతీయవాదం వల్ల ప్రజలు బహిరంగంగా ముందుకు రాలేకపోతున్నారని ఆమె అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆమె శనివారం ప్రసంగించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదని, తెలంగాణ ఎప్పుడు వస్తుందో తెలియదని, అయితే వెంటనే ఎన్నికలు వస్తే సమైక్యాంధ్రలోనే ఎన్నికలు జరుగుతాయని, 2014లో ఎన్నికలు తెలంగాణలో జరుగుతాయో, సమైక్యాంధ్రలో జరుగుతాయో తెలియదని ఆమె అన్నారు. అయితే, తెలంగాణ ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవం దెబ్బ తినకుండా వ్యవహరిస్తామనే సంకేతాలను పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

వైయస్సార్ లేని మంత్రివర్గంలో ఉండబోనని తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని, తెలంగాణ కోసం శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశానని, రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన ఆదరణ ఉందో, వరంగల్లు జిల్లాలో తనకు అంత ఆదరణ ఉందని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వైయస్సార్ అడ్డుపడ్డారనే దుష్ప్రచారం సాగుతోందని ఆమె అన్నారు. అప్పుడు కాంగ్రెసు పార్టీ పోరాటంలో కూడా లేదని ఆమె అన్నారు. ఇప్పుడు తెలంగాణకు ఎవరు అడ్డుపడుతున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రం, కాంగ్రెసు తెలంగాణను ఇవ్వాల్సి ఉందని, కాంగ్రెసు పార్టీ తెలంగాణను తేవాల్సి ఉందని ఆమె అన్నారు. తెలంగాణకు అడ్డుపడ్డారంటూ వైయస్సార్‌ను చులకన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఎగిసిపడుతోందని ఆమె అన్నారు.

English summary
MLA Konda Surekha demanded YSR Congress party president YS Jagan to clarify stand on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X