వైయస్ జగన్, చంద్రబాబు దొందూ దొందే: నాగం

తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన తెలంగాణ రాజకీయ నాయకులు పార్టీలపరంగా విడివిడి ఉద్యమాలు చేయడం సీమాంధ్ర కుట్రలో భాగమని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర కుట్రలో తెలంగాణ రాజకీయ నాయకులు పావులుగా మారుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అన్ని రాజకీయ పార్టీల తెలంగాణ నాయకులు కలిసి తెలంగాణ కోసం పోరాడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
ఒకే లక్ష్యం కోసం రాజీనామాలు చేసిన నాయకులు ఒక చోట ఎందుకు సమావేశం కాలేకపోతున్నారని ఆయన అడిగారు. తమకు పార్టీలు లేవు, తాము పిలుస్తాం రావాలని ఆయన అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఉద్దేశించి అన్నారు. ఇప్పటికైనా నాటకాలు కట్టపెట్టాలని ఆయన కోరారు. ఇప్పటికీ రాజీనామాలు చేయనివారు పదవులు వదులుకుని ఉద్యమ బాట పట్టాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఒకే మాట, ఒకే బాటగా పనిచేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications