వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ మరో నవాబు: నిప్పులు చెరిగిన విహెచ్

వైయస్ జగన్ 365 కోట్ల ముందస్తు పన్ను చెల్లించాడంటే ఆస్తి ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని, ఇది బయటకు చెప్పిన ఆస్తి అని, చెప్పని ఆస్తి ఎంత ఉందో చెప్పలేమని ఆయన అన్నారు. అప్పుడు కనిపించని అవినీతి మరో పార్టీ పెట్టగానే వైయస్ జగన్‌కు కాంగ్రెసు పార్టీలో అవినీతి కనిపించిందా అని ఆయన అడిగారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని జగన్ విమర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. తన భర్త రాజీవ్ గాంధీని చంపినవారిని కూడా క్షమించిన దయాగుణం సోనియాదని ఆయన అన్నారు. వైయస్ జగన్ వ్యవహారమేమిటో తెలంగాణ ప్రజలకు అర్థమైందని ఆయన అన్నారు.