హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ మమ్మల్ని కాపీ కొట్టాడు: ఎర్రంనాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
విజయవాడ/ హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎన్నికల ప్రణాళికను కాపీ కొట్టారని తెలుగుదేశ పార్టీ సీనియర్ నాయకుడు కె. ఎర్రన్నాయుడు వ్యాఖ్యానించారు. తనకు 38 మంది పార్లమెంటు సభ్యులను ఇస్తే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని తెచ్చుకునేవాడినని అంటున్న జగన్ కాంగ్రెసు వైపు ఉంటారో, బిజెపి వైపు వెళ్తారో చెప్పాలని ఆయన శనివారం విజయవాడలో మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు.

వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విభజన చిచ్చు పెడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అస్థిరతను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నోరు విప్పాలని, లేకుంటే బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్‌లో తుడిచి పెట్టుకుపోతుందని ఆయన అన్నారు. కెసిఆర్, జగన్ పరస్పర అవగాహనకు వచ్చి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారని ఆయన అన్నారు.

ప్రస్తుత వేర్పాటువాదానికి ప్రధాన కారకుడు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డే ప్రధాన కారకుడని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు ఎంవి మైసురా రెడ్డి హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి జైపాల్ రెడ్డి వేర్పాటువాదాన్ని రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. రాజీనామాల వల్ల సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తే తాము కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డి రకరకాలుగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత అనిశ్చితికి కాంగ్రెసు పార్టీ కారణమని ఆయన అన్నారు.

English summary
TDP senior leader K Yerram Naidu lashed out at YSR Congress party president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X