బంగ్లాదేశ్ ప్రమాదంలో 40 మంది పిల్లలు మృతి

పిల్లలు ట్రక్కులో పాడుతూ నృత్యాలు చేస్తున్నారని ప్రత్యక్ష సాక్షలు వెల్లడించారు. రోడ్డు బురదగా ఉండడంతో వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోయిందని అధికారి తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది మునిగిపోయిన ట్రక్కులో చిక్కుకుపోయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 40 మంది శవాలను వెలికి తీశారు. ఉత్సవాల సందర్భంగా, పండుగల సందర్భంగా తొందరగా వెళ్లడానికి బంగ్లాదేశ్‌లో ట్రక్కులను వాడుతుంటారు. ప్రమాదం స్థలి వద్ద పెద్ద యెత్తున ప్రజలు గుమికూడారు.












Click it and Unblock the Notifications