జగన్ తెలంగాణలో తిరగలేరు, పార్టీలో ఉండను: గోనె

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నాయకుడు గోనె ప్రకాశ రావు షాక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఆయన తెలంగాణ జిల్లాల్లో ఓదార్పు యాత్రను చేపట్టడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై జగన్ వైఖరి పూర్తిగా నిరాశకు లోను చేసిందని ఆయన సోమవార మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే వైయస్ జగన్‌కు పరిస్థితి మరోలా ఉంటుందన్నారు. ఓదార్పు యాత్రను తెలంగాణ జిల్లాల్లో నిర్వహించడం కష్టమవుతుందని ఆయన అన్నారు. అందువల్ల తెలంగాణపై జగన్ ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయక పోతే తాను పార్టీలో కొనసాగలేనన్నారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని, తెలంగాణ ఇచ్చేదీ తెచ్చేదీ తాము కాదని వైయస్ జగన్ ఇటీవల పార్టీ ప్లీనరీ సమావేశంలో చెప్పారు. తెలంగాణపై ఆయన స్పష్టమైన ప్రకటన చేయలేదనే విమర్శలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+