జగన్ శక్తి ఏమిటో సోనియాకు తెలుసు: అంబటి

Ambati Rambabu
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. జగన్ శక్తి ఏమిటో కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని అడిగితే తెలుస్తుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో లగడపాటికి సూచించారు. జగన్ శక్తిహీనుడో, శక్తిమంతుడో సోనియాను అడిగితే చెప్తారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అడిగినా చెప్తారని ఆయన అన్నారు. జగన్ శక్తికి సొంత జిల్లా చిత్తూరులో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీని గెలిపించుకోలేకపోయారని ఆయన అన్నారు.

కడప లోకసభ ఉప ఎన్నికలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి జగన్‌పై ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. బాబాయ్‌ను దూరం చేసి, డిఎల్ రవీంద్రా రెడ్డిని పోటీకి దించినా సోనియా జగన్‌ను ఓడించలేకపోయారని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదని లగడపాటి అనడాన్ని ఆయన తప్పు పట్టారు. లగడపాటి రాజగోపాల్ కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి బాటలోనే నడుస్తున్నారని, వైయస్సార్ ప్రజలకు హామీ ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు అలాగే మాట్లాడారని ఆయన అన్నారు. దమ్ముంటే విజయవాడ పార్లమెంటు సీటుకు రాజీనామా చేసి లగడపాటి మళ్లీ పోటీ చేయాలని, అప్పుడు జగన్ శక్తి ఏమిటో చూపిస్తారని ఆయన సవాల్ చేశారు. లగడపాటి ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+