పునర్వ్యస్థీకరణ సెగ: గురుదాస్ కామత్ రాజీనామా

జెనా ఒరిస్సా నుంచి నాలుగు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు ఆయనొక్కరే. క్యాబినెట్ హోదా కల్పించకపోవడమే కాకుండా ప్రాధాన్యం లేని శాఖ కేటాయించారని ఆయన అలిగారు. గురుదాస్ కామత్ కూడా తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనను సహాయ మంత్రిగా తీసుకుని మంచినీరు, పారిశుధ్య శాఖను కేటాయించారు. తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తితో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ప్రధానికి పంపించారు.
ముంబై నార్త్ ఈస్ట్ నుంచి కామత్ లోకసభకు ఎన్నికయ్యారు. సుబ్రహ్మణ్య స్వామి, ప్రమోద్ మహాజన్ వంటి హేమాహేమీలను ఓడించిన చరిత్ర ఈ 57 ఏళ్ల రాజకీయ నాయకుడికి ఉంది. ఇంతకు ముందు ఆయన సహాయ మంత్రిగా ఐటి, కమ్యూనికేషన్ల శాఖను, హోం అఫైర్స్ శాఖలను నిర్వహించారు.












Click it and Unblock the Notifications