సాయి ప్రతాప్‌కు ఉద్వాసన, కిశోర్ చంద్రదేవ్‌కు చోటు

జయంతి నటరాజన్‌కు పర్యావరణం, షిప్పింగ్ కార్పోరేషన్‌కు ముకుల్ రాయ్, జైరాం రమేష్‌కు గ్రామీణాభివృద్ధి, విలాస్ రావు దేశ్‌ముఖ్‌కు సైన్స్ అండ్ టెక్నాలజీ, సుదీప్ బందోపాధ్యాయకు హెల్త్ అండ్ ఫ్యామిలీ, వీరప్ప మొయిలీకి కార్పోరేట్ ఎఫైర్ మినిస్టర్, సుదీప్ బందోపాధ్యాయ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కాగా జైపాల్ రెడ్డి శాఖ మార్చలేదు. కిషోర్ చంద్రదేవ్‌కు కేబినెట్ హోదా కల్పించడంతో రాష్ట్రానికి రెండో కెబినెట్ పదవి లభించినట్లయింది. సాయి ప్రతాప్, ఎంఎస్ గిల్, హ్యాండిక్, కాంతిలాల్ భూరియా, అరుణ్ యాదవ్, దయానిధి మారన్ తదితర ఆరుగురిని మంత్రివర్గం నుండి తొలగించారు. వాణిజ్య శాఖ మంత్రిగా ఆనంద్ శర్మను తీసుకున్నారు. ఇందులో కొందరికి శాఖలు మార్పిడి చేశారు. గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా పని చేసిన వీరప్ప మొయిలీని న్యాయశాఖ మంత్రి నుండి కార్పోరేట్ ఎఫైర్ మినిస్టర్ శాఖకు మార్చారు. కాగా రాష్ట్రం నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనందుకు సాయి ప్రతాప్‌కు ఉద్వాసన పలికారు.
ప్రమాణ స్వీకారం చేసిన కేబినెట్ మంత్రులు
వి.కిషోర్ చంద్రదేవ్ - పంచాయతీరాజ్ శాఖ
పవన్ సింగ్ గట్వార్ - ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ
జైరామ్ రమేష్ - గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రమోషన్
దినేష్ త్రివేది - రైల్వే శాఖ
ప్రమాణ స్వీకారం చేసిన సహాయ మంత్రులు
జయంతి నటరాజన్ - పర్యవరణం, అటవీ శాఖ (స్వతంత్ర ప్రతిపత్తి) సహాయ మంత్రి
బేణి ప్రసాద్ వర్మ - గనుల శాఖ
సుధీప్ బందోపాధ్యాయ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి
చరణ్ దాస్ మహంత్ - అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ
జితేంద్ర సింగ్ - హొం శాఖ సహాయ మంత్రి
మిలింద్ దేవరా- కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ
రాజీవ్ శుక్లా - పార్లమెంటరీ వ్యవహారాల శాఖ