కాంగ్రెసులోనే ఉంటా, చివరి శ్వాస పార్టీలోనే: సాయి ప్రతాప్

కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిగా పేరుపొందిన సాయి ప్రతాప్ వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకే చెందినప్పటికీ ఆయనను ఎదుర్కొనడంలో తటస్థంగా ఉంటున్నాడన్న కారణంగానే ఆయనను తొలగించినట్లుగా తెలుస్తోంది. గత కడప ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ గెలుపు కోసం శ్రమించలేదని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీపై జగన్ ధాటిగా విమర్శలు చేస్తున్నప్పటికీ మంత్రి స్థాయిలో ఉన్న సాయి ప్రతాప్ వాటిని తిప్పి కొట్టక పోవడం అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications