వైయస్ జగన్ పై వచ్చిన అభియోగాలు ఇవే

* తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంతో పలు కార్పొరేటు సంస్థలు, వ్యక్తులకు భూములు, గనుల కేటాయింపు, లైసెన్స్‌ల మంజూరు చేయించడం ద్వారా జగన్ భారీగా ముడుపులు స్వీకరించారు.
* ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం తండ్రి ద్వారా లబ్ధి పొందిన సంస్థలు జగన్ కంపెనీల్లో భారీ ప్రీమియంతో పెట్టుబడులు పెట్టాయి.
* అవినీతి ఆర్జితంగా వచ్చిన నల్లధనాన్ని వివిధ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టించి తెల్లధనంగా మార్చుకున్నారు.
* హవాలా, మనీల్యాండరింగ్ ద్వారా డబ్బు మారిషస్‌కు తరలించి, మళ్లీ వెనక్కి తీసుకొచ్చి సొంత కంపెనీల్లో అధిక ప్రీమియంతో పెట్టుబడులు పెట్టారు.
* అక్రమ సొమ్ము మళ్లింపులతో జగతి పబ్లికేషన్స్‌ను, ఇందిరాటెలివిజన్‌ను నెలకొల్పారు.
* రాంకీ గ్రూపునకు చెందిన ఏరిస్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ జగతి పబ్లికేషన్స్‌లో అధికప్రీమియంతో షేర్లను కొనుగోలు చేయగా, ఆ సంస్థకు తక్కువ ధరకు గచ్చిబౌలిలో విలువైన హౌసింగ్ బోర్డు స్థలాన్ని, విశాఖపట్టణంలో సెజ్‌ను కేటాయించారు.
* హెటెరో గ్రూపునకు నక్కపల్లి, జడ్చర్ల సెజ్‌లలో 240 ఎకరాలను కేటాయించగా, ఆ సంస్థ జగతిలో వాటాలను కొనుగోలు చేసింది.
* నాదర్‌గుల్‌లో 595 ఎకరాల కొనుగోలు వ్యవహారంలో లబ్ధిపొందిన పి.వి.పి.బిజినెస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జగన్ సంస్థలో భారీ ప్రీమియంతో వాటాలను కొనుగోలు చేసింది.
* 2008-09 ఆర్థిక సంవత్సరానికి జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ రూ. 250 కోట్ల నష్టాన్ని చూపింది. ఇలాంటి సంస్థలో భారీగా ప్రీమియం చెల్లించి వాటాలు తీసుకున్నారు. గతంలో ప్రయోజనం పొందినందుకుగాను ప్రతిఫలంగానే ఈ పెట్టుబడులు పెట్టారు.
* జగన్ కారణంగా గాలి జనార్దన్‌రెడ్డికి ప్రభుత్వం ఓబుళాపురం గనులు కేటాయించింది. తక్కువ ధరకు బ్రహ్మణి స్టీల్ ప్లాంట్, ప్రైవేటు విమానాశ్రయానికి 10,760 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. దీనికి ప్రతిఫలంగా పలు బినామీ కంపెనీల ద్వారా జగన్‌కు భారీగా డబ్బు సమకూరింది.
* సాండూర్ పవర్ కంపెనీని 2001లో స్వాధీనం చేసుకున్న జగన్... వైయస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే కంపెనీలోకి అక్రమ పద్ధతుల్లో నిధులు తరలించారు.
* దాల్మియా, ఇండియా సిమెంట్స్ వంటి సంస్థలు సర్కారు వల్ల పొందిన లబ్ధికి ప్రతిఫలంగా భారతి సిమెంట్స్‌లో వాటాలు కొనుగోలు చేశాయి.
2009లో జగన్ ఎంపీగా ఎన్నికయ్యాక కూడా ఇవి కొనసాగించారని, అందువల్ల ప్రజాప్రతినిధిగా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8, 9, 13ల కింద ప్రాసిక్యూట్ చేయాలని లేఖలో కోరారు.
ఇక తెదేపా నేతలు, న్యాయవాది షేర్వాణి కూడా జగన్ ఆస్తులపై పిటిషన్లు దాఖలు చేశారు. వీటిలోని ముఖ్యాంశాలు..
* జగన్ చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వానికి నష్టం అంటే సమాజానికే. అంటే ప్రతి వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లే. అందువల్ల ఈ వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి.
* అవినీతి నిరోధక చట్టం కింద, మనీ ల్యాండరింగ్ చట్టాల కింద నేరాలకు పాల్పడిన జగన్‌పై ఇప్పటివరకు ఏవైనా చర్యలు తీసుకున్నట్లయితే స్థాయీ నివేదిక సమర్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సీబీఐ, ఏసీబీలను ఆదేశించాలి.
* రాజశేఖర్‌రెడ్డి 2004లో తన ఆస్తుల విలువ రూ. 2.12 కోట్లుగా ఎన్నికల కమిషన్ ముందు ప్రకటించారు. 2003-04లో జగన్ తన వార్షిక ఆదాయాన్ని రూ.9,19,951గా ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో పేర్కొన్నారు. 2009లో కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన సమయంలో జగన్ తన ఆస్తుల విలువను రూ.77.40 కోట్లుగా ప్రకటించారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మే 2004 నుంచి 36 కంపెనీలను జగన్ ఏర్పాటు చేశారు.
* చట్టానికి అందకుండా అవినీతి సొమ్ము ప్రవాహానికి ఈ కంపెనీలను జగన్ వినియోగించుకున్నారు.
* నిబంధనలకు విరుద్ధంగా వాన్‌పిక్ ప్రాజెక్టుకు ప్రభుత్వం 15 వేల ఎకరాలను కేటాయించింది. ప్రతిగా వాన్‌పిక్‌కు చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ జగతిలో రూ. 650చొప్పున 21.42 లక్షల వాటాలు కొనుగోలు చేశారు. * 2005లో రూ. 125 కోట్ల అవినీతి సొమ్ము మారిషస్‌లో ఉన్న 2ఐ క్యాపిటల్ (పీసీసీ), ప్లూరి ఎమర్జింగ్ కంపెనీల నుంచి సాండూర్ కంపెనీలోకి వచ్చింది.
* మారిషస్ ఆధారిత కంపెనీలు, అనుబంధ కంపెనీల ద్వారా జగన్‌కు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పెట్టుబడులు ప్రవహించాయి.
* జగతిలో రూ.73.57 కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యవస్థాపకులకు 90 శాతం వాటానే ఉందని, కొన్ని కంపెనీలు 10 శాతం వాటాలను రూ. 300.49 కోట్లతో కొనుగోలు చేశాయని ఐటీ శాఖ ఎత్తిచూపింది.
న్యాయవాది పిటిషన్‌లోని అంశాలు
* జగన్ ప్రస్తుతం సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ఇలాంటి అవినీతి నీడ ఉన్న వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నతస్థానాలను అలంకరిస్తే జాతీయ ఆర్థిక రంగానికేకాక, జాతీయ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుంది.
* వాన్‌పిక్‌కు సీనరేజీ రాయితీలను ఇస్తూ జీవో 318 జారీచేయడంపై, రఘురాం సిమెంట్స్‌కు భూకేటాయింపులు చేస్తూ జీవో 95 జారీ చేయడంపై విచారణ జరిపించాలి.












Click it and Unblock the Notifications