ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరం మరోసారి వరుస బాంబు పేలుళ్లతో వణికిపోయింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ముంబై నగరాన్ని ఈ పేలుళ్ల ఘాతుకం తాకింది. ముంబైలో బుధవారం సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల మధ్య వరుసగా మూడు బాంబు పేలుళ్లు సంభవించాయి. నిమిషాల వ్యవధిలోనే ఈ పేలుళ్లు జరిగాయి. ముంబైలోని దాదార్ వెస్ట్‌లో ఓ కారులో ఓ బాంబు పేలగా, దక్షిణ ముంబైలోని ఒపెరా హౌస్‌లో మరో బాంబు పేలింది. ఝవేరి బజార్‌లో కూడా బాంబు పేలుడు సంభవించింది. 1993లో జవేరి బజార్‌లో జరిగిన పేలుడులో 50 మంది మరణించారు. మూడు వరుస పేలుళ్లలో 21 మంది మరణించినట్లు సమాచారం. గాయపడినవారు 200 మందికిపైగానే ఉంటుందని తెలుస్తోంది. మృతుల సంఖ్య, గాయపడినవారి సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. ప్రజలు భారీగా రోడ్ల మీదికి వచ్చిన సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి.
ముంబైలో జరిగిన మూడు పేలుళ్లలో 200కిపైగా గాయపడినట్లు సమాచారం. ముంబైలో బాంబు పేలుళ్లు జరిగిన నేపథ్యంలో అన్ని నగరాలను అప్రమత్తం చేశారు. ఢిల్లీ, హైదరాబాదు వంటి నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరనేది తెలియడం లేదు. పాక్ ఉగ్రవాదులు గానీ అండర్ వరల్డ్ గానీ ఆ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మూడు పేలుళ్లు కూడా టిఫిన్ బాంబులేనని తెలుస్తోంది. అందువల్ల ఇండియన్ ముజాహిదీన్ పాత్ర ఇందులో ఉండవచ్చునని అంటున్నారు. పేలుళ్లలో 60 మంది దాకా మరణించారని అధికారులు చెప్పారు. మూడు పేలుళ్లలోనూ ఐఇడి వాడినట్లు హోం మంత్రిత్వశాఖ వర్గాలు చెప్పాయి. ముంబైకి జాతీయ దర్యాప్తు బృందాన్ని పంపించారు. ఢిల్లీ దర్యాప్తు చేసి, ఫొరెన్సిక్ సాక్ష్యాలను సేకరిస్తోంది.
ముంబై పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యవసరంగా సమావేశమైంది. ముిబైకి ఢిల్లీ నుంచి బిఎస్ఎఫ్ విమానంలో ఎన్ఎస్‌జి బలగాలు బయలుదేరాయి.
here are reports of three blasts in Mumbai. The explosions are believed to have taken place in Dadar and Jhaveri Bazaar. Eight to ten people are believed to have been injured.
Story first published: Wednesday, July 13, 2011, 19:46 [IST]