మంత్రి కన్నాకు వైయస్ జగన్ వర్గ ఎమ్మెల్యేల సెగ

Kanna Laxmi Narayana
కడప: కడప జిల్లా ఇంచార్జీ మంత్రి కన్నా లక్ష్మినారాయణకు బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు శాసనసభ్యుల సెగ తగిలింది. జిల్లా అభినృద్ధి మండలి సమీక్షా సమావేశంలో జగన్ వర్గం శాసనసభ్యులు ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్సలు చేశారు. అభివృద్ధి నిధుల విడుదలలో తమ నియోజకవర్గాల పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వారు కన్నా లక్ష్మినారాయణను నిలదీశారు. ఈ సమావేశానికి పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ కూడా హాజరయ్యారు.

నిధుల విడుదలలో తమ నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తొలుత వైయస్ జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి ఆయనకు మద్దతుగా నిలిచారు. తమకు జవాబు చెప్పాలని వారు పట్టుబట్టారు. దీనిపై కన్నా లక్ష్మినారాయణ సమాధానం చెప్పకపోగా మౌనం వహించారు. దీంతో ఆగ్రహించిన నలుగురు శాసనసభ్యులు సమావేశాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఆయన మంత్రి నుంచి సమాధానం రాకపోవడంతో వారు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఆ తర్వాత సమావేశానికి వచ్చి పోడియం వద్ద మంత్రికి ఎదురుగా బైఠాయించారు. విజయమ్మ మాత్రం వెళ్లిపోయారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా కూడా హాజరయ్యారు. ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం శాసనసభ్యులు కూడా విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+