పేలుళ్లకు టైంబాంబులు వాడారు: చిదంబరం

పేలుళ్లలో 131 మంది గాయపడ్డారని, వారిలో 23 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు. పేలుళ్లలో 17 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. 31 నెలల్లో ముంబైలో ఇది రెండో ఘటన అని ఆయన అన్నారు. గాయపడినవారు 11 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. దాడులకు సంబంధించి ముందస్తు సమాచారం లేదని ఆయన అన్నారు. ఏ సంస్థ కూడా దాడులకు తామే బాధ్యులమని ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతుందని ఆయన చెప్పారు. వదంతులు నమ్మవద్దని ఆయన చెప్పారు. పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, అరెస్టు చేస్తే చెబుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications