తెలంగాణ సిఎం చేతుల్లో లేదంట: కోదండరామ్

ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు. ఆగస్టు 1వ తారీఖు నుండి సకల జన సమ్మె చేస్తామని చెప్పారు. తెలంగాణ అంశం తన పరిధిలో లేదని అయితే అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. తెలంగాణ ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నారు. తెలంగాణ ప్రాంతంలోని 99 శాతం మంది ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు. కోదండరామ్‌తో పాటు మల్లేపల్లి లక్ష్మయ్య, స్వామిగౌడ్ తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications