సమైక్యాంధ్రకు 6గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు

Shailajanath
విజయవాడ‌: సమైక్యాంధ్ర కోసం విజయవాడలో శనివారం ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆరుగురు మంత్రులు, పది మంది శానససభ్యులు, నలుగురు శానససభ్యులు హాజరయ్యారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు హాజరు ఇదే ఉంది. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుందని భావిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అందించే ప్రతిపాదనలపై చర్చించడానికి కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు శైలజానాథ్, కాసు వెంకటకృష్ణా రెడ్డి, పార్థసారథి, టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి, పితాని హాజరయ్యారు.

కాంగ్రెసు శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్, రాజేష్, డిఎస్ దాసు, గాదె వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెసు ఎమ్మెల్సీలు పాలడుగు వెంకటరావు, సింగం బసవపున్నయ్య, రాయపాటి శ్రీనివాస్, ఐలా వెంకయ్య సమావేశానికి వచ్చారు. 20 సూత్రాల అమలు పథకం చైర్మన్ తులసిరెడ్డి కూడా వచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఎవరూ ఈ సమావేశానికి రాలేదు. ఉత్తరాంధ్ర గత కొద్ది రోజులుగా ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం జరుగుతోంది. పైగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఉత్తరాంధ్రకు చెందినవారే. నెల్లూరు జిల్లా నుంచి సమావేశానికి ఎవరూ రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+