ఏకాభిప్రాయానికి కిరణ్, బొత్స సంప్రదింపులు

Botsa Satyanarayana and CM Kirankuamar Reddy
హైదరాబాద్: తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో ఎదురవుతున్న చిక్కులకు మూలం ఎక్కడుందో కాంగ్రెసు పార్టీ అధిష్టానం గుర్తించినట్లే ఉంది. అందుకే తొలుత రాష్ట్రానికి చెందిన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకుల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. తమ పార్టీకి చెందిన ఇరు పార్టీల నాయకుల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తే తెలంగాణపై పార్టీ అధిష్టానం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఓ నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని భావిస్తున్నారు. ఈ ఏకాభిప్రాయ సాధన కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సంప్రదింపులు సాగిస్తున్నారు. ఈ సంప్రదింపుల ప్రక్రియను బుజ్జగింపు సమావేశాలకు మీడియా చిత్రీకరిస్తూ వస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఇటీవల మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎత్తి చూపారు.

తమ పార్టీలో ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని, ఇతర పార్టీలతో తమకు సంబంధం లేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ పార్టీ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తెలుగుదేశం పార్టీ విషయాన్ని వదిలేయవచ్చునని అనుకుంటున్నారు. నిజానికి, చంద్రబాబు అడ్డం తిరగడం వల్లనే వచ్చిన తెలంగాణ రాకుండా పోయిందని కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా తమ పార్టీ అధిష్టానం వైపే వేలేత్తి చూపుతున్నారు. దీంతో చంద్రబాబుకు కాస్తా ఊరట లభించింది.

తమ పార్టీ తెలంగాణ నాయకులే రాజీనామాలు చేసి, తమపైనే తిరుగుబాటుకు సిద్ధపడడంతో కాంగ్రెసు అధిష్టానం దిగిరాక తప్పలేదు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకులు తమ తమ పట్టు వీడడం లేదు. అయితే, ఏదో ఒక చోట ఇరు ప్రాంతాల నాయకులకు మధ్య సయోధ్య కుదిరించి, సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులతో బొత్స సత్యనారాయణ చర్చలను పూర్తి చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఇక, సీమాంధ్ర నాయకులతో ఆయన చర్చలు చేపట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+