వల్లభనేని వంశీ అనచురుడు మోహన్ హత్య?

వడ్లమూడి మోహన్ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టిఎన్ఎస్ఎఫ్) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. విజయవాడలోని విద్యార్థులను కూడగట్టడంలో అతను ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అతని చుట్టూ ఎప్పుడు వంద మంది దాకా ఉంటారు. మూడు నెలల క్రితం విద్యార్థుల మధ్య జరిగిన సంఘటన వల్లనే మోహన్ హత్యకు గురై ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంత కాలంగా విజయవాడలో విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
వడ్లమూడి మోహన్‌ది హత్యేనని తెలుగుదేశం విజయవాడ నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ అన్నారు. మోహన్‌ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. నగర పోలీసు కమిషనర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరుతామని ఆయన శనివారం ఉదయం మీడియా ప్రతినిధులతో చెప్పారు.












Click it and Unblock the Notifications