వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి: విజయనిర్మల

వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు నీరుగారిపోయాయని ఆమె విమర్శించారు. రాజకీయాలు దిగజారాయని, రాజకీయాల్లో విలువలు పడిపోయాయని ఆమె అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసమే జీవించాడని, ప్రజల కోసమే మరణించాడని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు చాలా బాధేసిందని ఆమె అన్నారు. తాను, తన కుమారుడు నరేష్, భర్త కృష్ణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు ఆమె ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. నరేష్‌తో కలిసి ఆమె వైయస్ జగన్‌తో సమావేశమయ్యారు కూడా.












Click it and Unblock the Notifications