హైదరాబాద్:
మిస్
యూనివర్స్
పోటీలకు
సుస్మితాసేన్
తర్వాత
ఇన్నాళ్లకు
మన
తెలుగమ్మాయి
పేరు
వినిపించబోతోంది.
అచ్చమైన
పదహారణాల
తెలుగమ్మాయి
వాసుకి
సుంకవల్లి
ఈ
పోటీలలో
భారతదేశానికి
ప్రాతినిధ్యం
వహించే
అరుదైన
అవకాశాన్ని
చేజిక్కించుకుంది.
ముంబైలో
నిర్వహించిన
వాద్వా
న్
లైఫ్‌స్టైల్
అయామ్
షీ
-2011
పోటీ
ఫైనల్స్‌లో
17
మంది
సుందరాంగులను
తలదన్ని
టైటిల్‌ను
గెలుచుకుంది.
ఆమెకు
మిస్
యూనివర్స్
ఇండియా-2011
టైటిల్
దక్కింది.
వాసుకి
స్వస్థలం
పశ్చిమగోదావరి
జిల్లా
తాడేపల్లిగూడెం
సమీపంలోని
ఉంగుటూరు!
తల్లిదండ్రులు
హైదరాబాద్‌లో
స్థిరపడటంతో
ఆమె
ఇక్కడే
పెరిగింది.
26
ఏళ్ల
వయసున్న
వాసుకి
పొడవు
1.73
మీటర్లు.
హైదరాబాద్‌లో
ప్రాథమిక
విద్యాభ్యాసం
పూర్తిచేసుకున్న
వాసుకి
న్యూయార్క్
యూనివర్సిటీలో
న్యాయ
శాస్త్రంలో
మాస్టర్స్
డిగ్రీ
చేశారు.
మోడల్‌గా
నైకీ,
వరల్డ్
గోల్డ్
కౌన్సిల్
లాంటి
సంస్థలకు
పనిచేయటంతో
పాటు
ర్యాంప్‌వాక్‌లు
కూడా
చేసిన
ఈమె
హాబీగానే
మోడల్‌గా
మారానని,
దేశం
తరపున
పాల్గొనాలనే
లక్ష్యంతోనే
ఈ
పోటీలో
పాల్గొన్నానని
గతంలో
ఆమె
చెప్పారు.
అప్పుడు
చెప్పినట్లే
మిస్
యూనివర్స్
పోటీలలో
దేశానికి
ప్రాతినిధ్యం
వహించే
అవకాశం
ఆమెకు
దక్కింది.
ఈ
సంవత్సరం
సెప్టెంబర్
12వ
తేదీన
బ్రెజిల్‌లోని
సావోపౌలోలో
జరిగే
మిస్
యూనివర్స్
2011
పోటీలలో
ఆమె
మన
దేశం
తరఫున
పాల్గొంటుంది.
దేశం
గర్వపడేలా
మిస్
యూనివర్స్
టైటిల్‌ను
తీసుకొస్తానన్న
విశ్వాసాన్ని
ఈ
సందర్భంగా
వాసుకి
వ్యక్తం
చేశారు.
అయామ్
షీ
పోటీలలో
భోపాల్‌కు
చెందిన
పరుల్
దుగ్గల్
ఫస్ట్
రన్నరప్‌గాను,
ముంబైకి
చెందిన
తన్వి
సింగ్లా
సెకండ్
రన్నరప్‌గాను
నిలిచారు.
గతంలో
మిస్
యూనివర్స్‌గా
నిలిచి,
అనంతరం
సినీనటిగా
మారిన
సుస్మితా
సేన్
చేతుల
మీదుగా
వాసుకి
మిస్
యూనివర్స్
ఇండియా-2011
కిరీటాన్ని
అందుకున్నారు.