బాబూ! ఇంకా మోసం చేయొద్దు: నాగం హెచ్చరిక

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి పూనుకోవద్దని ఆ పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. తెలంగాణపై చంద్రబాబు ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2009లో మేనిఫెస్టోలో పెట్టి ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెడితే మద్దతు పలుకుతామని చెప్పి ఆ తర్వాత కేంద్రం తెలంగాణ ప్రకటించిన తర్వాత చంద్రబాబు వెనక్కి తగ్గాడని ఆరోపించారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు తెలంగాణ వచ్చే వరకు ఎన్నికలకు వెళ్లమని ఓ వైపు ప్రకటనలు చేస్తుండగా మరోవైపు చంద్రబాబు ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. టిడిపి నేతలు తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత గద్దర్, విమలక్కల చుట్టూ తిరగకుండా కాంగ్రెసు నేతలలాగా చంద్రబాబు వద్దకు వెళ్లి ఆందోళన చేయాలని సూచించారు. తెలంగాణపై బాబు ద్వంద వైఖరి వీడకుంటే పార్టీ గానీ, చంద్రబాబు బొమ్మగానీ తెలంగాణలో కనిపించదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+