ఆంధ్రప్రదేశ్‌లో భారీ యురేనియం నిక్షేపాలు

అణు ఇంధన శాఖకు చెందిన అణు ఖనిజాల డైరెక్టరేట్ అంచనాల మేరకు యురేనియం నిక్షేపాలు గతంలో 15 వేల టన్నులు ఉంది.ఇపుడు గుర్తించిన నిక్షేపాలు గనుక 1.5 లక్షల టన్నులకు పైగా వుంటే, తుమ్మలపల్లి గనులు ప్రపంచంలోనే అతి పెద్దవైన యురేనియం గనులుగా ఖ్యాతికెక్కుతాయని బెనర్జీ చెపుతున్నారు. దేశం మొత్తంలో ఇప్పటిదాకా 1.7 లక్షల టన్నుల వరకు యురేనియం నిల్వలు వుండవచ్చనని భావిస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీ కి ఈ నూతన పరిశోధన ఎంతో బలాన్నిస్తోంది.
తుమ్మలపల్లి చుట్టుపక్కల 160 కిలోమీటర్ల పరిధిలో 400 మీటర్ల లోతు వరకు ఈ యురేనియం నిక్షేపాలు వుండివుండవచ్చని ఎఎండి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భారత యురేనియం కార్పోరేషన్ లిమిటెడ్ లిమిటెడ్ (యుసిఐఎల్) యురేనియం కార్యకలాపాలను 2007లో మొదలు పెట్టింది. ఈ సంవత్సరం చివరినాటికి దాని ఫ్యాక్టరీలు ఈ ఖనిజాన్ని శుధ్ధిచేసే ప్రక్రియను మొదలుపెట్టవచ్చు. యుసిఐఎల్ కు కర్మాగారం జార్ఖండ్ రాష్ట్రంలో వుంది. దీనికవసరమైన ఖనిజాలను మేఘాలయ, కర్నాటకలలో గుర్తించారు. తుమ్మలపల్లి లో కనుగొన్న నిల్వలు భారీ ఎత్తున వున్నప్పటికి నాణ్యత తక్కువ తక్కువని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications