హరికృష్ణ సమైక్యాంధ్ర రాగం, పార్టీ ఎంపీల భేటీ

Harikrishna
న్యూఢిల్లీ: తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి బావమరిది నందమూరి హరికృష్ణ సమైక్యాంధ్ర రాగం ఆలపించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు పార్టీ పార్లమెంటు సభ్యుడు వేణుగోపాల్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.

సమైక్యాంధ్ర కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని, రాష్ట్ర విభజనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని తెలుగుదేశం సీమాంధ్ర నాయకుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో అనిశ్చిత నెలకొని అభివృద్ధి నిలిచిపోయిందని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్రపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు సీమాంధ్ర తెలుగుదేశం ఎంపీలు మంగళవారం ఢిల్లీలో ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి నివాసంలో సమావేశమైన అనంతరం మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా ఉండాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నదినిపై చర్చలు జరిపినట్లు తెలిపారు. బుధవారం గుంటూరు జిల్లాలో ఆంధ్ర, రాయలసీమ ప్రజాప్రతినిధుల సమావేశం జరుగనున్నదని, ఆ సమావేశానికి తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గౌరవించి, పాటిస్తామని మైసూరారెడ్డి తెలిపారు. ఆ నిర్ణయాలనే పార్లమెంట్ వరకు తీసుకువెళతామని అన్నారు.

రాష్ట్ర విభజనపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించినా కేంద్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మైసూరారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇన్ని అనర్ధాలకు కేంద్రమే కారణమని, సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం), నిమ్మల కిష్టప్ప (హిందూపురం), డాక్టర్ ఎన్ శివ ప్రసాద్ (చిత్తూరు), రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ, డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, సుజనా చౌదరి తదితరులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+