ఆజాద్‌కు ఝలక్: ఇప్పుడే చెప్పలేనని కెకె

అయితే ఆజాద్ మంగళవారం టి-కాంగ్రెసుకు నేతృత్వం వహిస్తున్న కె కేశవరావుకు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. కెకెకు ఫోన్ చేసి తెలంగాణపై, రాజీనామాలపై చర్చించేందుకు ఢిల్లీ రావాల్సిందిగా ఆహ్వానించాడు. అందుకు కేశవరావు తాము ఢిల్లీ వస్తామని ఇప్పుడే మాట ఇవ్వలేమని, స్టీరింగ్ కమిటీలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు అధిష్టానం చుట్టూ తిరిగిన తెలంగాణ కాంగ్రెసు ప్రజా ప్రతినిధుల నుండి ఇలాంటి సమాధానాలు, వారిలో ఇలాంటి పట్టుదల ఉందని ఆజాద్ ఊహించి ఉండడు.












Click it and Unblock the Notifications