రాజీనామాలపై ఆంధ్ర తెనాలికి తెలంగాణ నాగం

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే రాజీనామాలు చేశామని అన్నారు. స్పీకర్ ఎవరి ఒత్తిడులకు లొంగకుండా తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్టం కొరకే తాము రాజీనామాలు చేసినట్లు చెప్పారు. మంగళవారం స్పీకర్ వస్తారని చెప్పారని అయితే ఇప్పటి వరకు రాక పోవడంతో తాము బైఠాయించామని చెప్పారు. మంగళవారం రాజీనామాలపై స్పష్టమైన నిర్ణయం రాని పక్షంలో బుధవారం తెనాలి వెళతామని చెప్పారు. కాగా నాగం జనార్దన్ రెడ్డితో పాటు జోగు రామన్న, హరీశ్వర్ రెడ్డి సైతం రాజీనామాలు ఆమోదించాలంటూ బైఠాయించారు. కాగా నాగం వర్గం సిఎస్ సదారంతో భేటీ అయింది.












Click it and Unblock the Notifications