వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ విచారణకు వైయస్ జగన్ అభ్యంతరాలేమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: జగన్ కంపెనీలపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చేస్తున్న విచారణను నిలిపివేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జగన్, ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన జగతీ పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్, మాట్రిక్స్ కంపెనీల ప్రతినిధులు కూడా సీబీఐ విచారణను ఆపివేయాలని కోరుతూ స్పెషన్ లీవ్‌పిటీషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. సిబిఐకి, మంత్రి శంకరరావుకు, హైకోర్టు అడ్వొకేట్ జనరల్‌కు వ్యతిరేకంగా మూడు పిటిషన్లు దాఖలు చేశారు.

అసలు సిబిఐ ప్రాథమిక విచారణను జగన్ ఏ కారణాలతో వ్యతిరేకిస్తున్నారనేది ప్రశ్న. వాటిని ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో వివరించారు. ప్రస్తుత మంత్రి శంకరరావు పిటిషన్ విచారణకు అర్హమైందా, కాదా అనే విషయం తేలకుండానే ప్రాథమిక విచారణ జరపడం సరైంది కాదని జగన్ తరఫు ప్రతినిధి అభిప్రాయపడ్డారు. హైకోర్టు తన పరిధిని దాటిందని కూడా ఆక్షేపించారు. తనను, తన కుటుంబ సభ్యులు ఈ స్థాయిలో విచారించడం తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన అన్నారు తన పరుపుప్రతిష్టలకు, కంపెనీ ఆస్తులకు నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. తనకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులు కోర్టును ఆశ్రయించారని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. తాను ఓదార్పు యాత్రను చేపట్టడంతో కాంగ్రెసు అధిష్టానంతో తన సంబంధాలు క్షీణించాయని, తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత శంకరరావు లేఖను కోర్టు పరిగణనలోకి తీసుకుందని ఆయన అన్నారు. తనపై కోర్టుకు లేఖ రాసినందుకు శంకరరావుకు మంత్రి పదవి దక్కిందని అన్నారు.

జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులతో పాటు ఎమ్మార్ ప్రాపర్టీస్, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్, పీవీపీ వెంచర్స్, నవభారత్, కార్మెల్ ఆసియా తదితర సంస్థల ప్రతినిధులు సోమవారం సుల్తాన్‌బజార్‌లోని సీబీఐ కార్యాలయంలో హజరయ్యారు. హైకోర్టు ఇచ్చిన గడువుకు సరిపోయే విధంగా జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ తదితర సంస్థలపై మాత్రమే విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే.. జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి సోమవారం సాయంత్రం సీబీఐ కార్యాలయానికి హజరై ఇందిరా టెలివిజన్, కార్మెల్ ఆసియా, జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించిన పలు పత్రాలను అందచేశారు. మరోవైపు.. పీవీపీ వెంచర్స్ ప్రతినిధులు తమకు చెందిన ఐదు కంపెనీల వివరాలను అందజేశారు. అనంతరం హెటిరో గ్రూప్ కంపెనీల ప్రతినిధి సీబీఐ కోరిన డాక్యుమెంట్లు అందజేశామని తెలిపారు.

English summary
YSR Congress party president YS Jagan challenged High Court order in Supreme court. He is showing reasons for his opposition for CBI probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X