దేవినేని ఉమ, పార్థసారథి మాటల యుద్ధం

Devineni Uma Maheswara Rao
విజయవాడ: మంత్రి పార్థసారథి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వరరావు మధ్య బుధవారం మాటల యుద్ధం కొనసాగింది. మంత్రి అవినీతిని నిరుపిస్తానని అందుకు చర్చలకు రావాలని దేవినేని ఉమ సవాల్ విసిరడం, బుధవారం ఉమ తన అనుచరులతో గొల్లపూడి గ్రామానికి చేరుకోవడం దేవినేనిని పోలీసులు అరెస్టు చేయడం వంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత దేవినేని పార్థసారథిపై ఫైర్ అయ్యారు. తనతో చర్చలను ఎదుర్కోలేకే తనను అరెస్టు చేయించాడని దేవినేని ఆరోపించారు.

అందుకు మంత్రి సైతం ధీటుగా స్పందించారు. గొల్లపూడి గ్రామానికి చేరుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. తాను ఆరోపణలకు సమాధానం చెప్పలేక అరెస్టు చేయించానని ఉమ అన్న వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. అరెస్టు అయిన ఇరు పార్టీల కార్యకర్తలు విడుదలయినప్పటికీ దేవినేని ఇంకా పోలీసు స్టేషన్‌లోనే ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఉమ కోరితే తాను పోలీసు స్టేషన్‌కు సైతం చర్చలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పోలీసులు శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. చివరకు ఎలాంటి గొడవలు, చర్చలు లేకుండా కార్యక్రమం ముగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+