అమ్మో చైనా తాత1.5, టన్నులు కిరోసిన్ తాగేశాడట..!

Amazing Man
ఉదయం లేవాగానే మనం ఏం తాగుతామండి.. కాఫీనో లేక టీనో ఈ రెండు కాకపోతే మంచినీళ్లు తాగుతాం.. కాని ఆ 71 సంవత్సరాల ముసలాయన ఏం చేస్తాడో తెలుసా..? ఒక గ్లాసుడు కిరోసిన్ ను గటాగటా తాగేసి ఎంచక్కా పనుల్లో నిమగ్నమైపోతాడు. వినటానికే మనకే వింతగా ఉంటే ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎంత ఆశ్చర్యపోయారో.. ఎందుకంటే 42 సంవత్సరాల నుంచి ఈ తాత కిరోసిన్ తాగుతున్నా ఇప్పటికి గుండ్రాయిలా ఉన్నాడట. చెన్ డీజెన్ అనే ఈ తాత చైనాలోని నాన్ చౌన్ జిల్లా జీజియాంగ్ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నాడు.

'రాత్రి పూట బాగా దగ్గు వచ్చేది.. బాగా ఛాతీ పట్టేసినట్లు ఉండేది..డాక్టర్ దగ్గరికి వెళితే మందులిచ్చారు. అవి వాడినా దగ్గు మాత్రం తగ్గలేదు.. ఈ బాధకు ఉపశమనం ఏలానా ఆలోచిస్తున్నప్పుడు మా పూర్వీకులు ఇలాంటి జబ్బులకు కిరోసిన్, గ్యాసోలైన్ తీసుకునేవారని తెలిసింది. అప్పటి (1969) నుంచి నేను కూడా రోజు కిరోసిన్ తాగడం మొదలుపెట్టాను..పది రోజులకు ఒక సారి కొండ దిగి పెట్రోలు బంక్ కు వెళ్లి కిరోసిన్ తెచ్చకుంటానని" చెన్ చెప్పాడు.

కిరోసిన్ దొరకని సందర్భాల్లో కిరోసిన్ లానే ఉండే గ్యాసోలైన్ ను చెన్ తాగుతాడు.. కుటుంబీకులు ఎంత వారించినా చెన్ వినేవాడు కాదంట..చిత్రమైన అలవాటున్న చెన్ గురించి తెలుసుకున్న పాత్రికేయులు కొండలు, గుట్టలు దాటుకుని మరి వెళ్లి ఆయన గురించి ఆసక్తికర కథనాలను రాశారు. చెన్ 42 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 1.5 టన్నుల (1512 లీటర్ల) కిరోసిన్ తాగి ఉంటాడని చైనా పత్రికలు వెల్లడించాయి.

"వెదురు బుట్టలు అల్లడం, రాళ్లను పగలగొట్టడంలో చేయి తిరిగిన చెన్ డీజెన్ ఆత్మాభిమానంలో ఒక్క మెట్టు కూడా దిగడు. దగ్గర్లోనే ఉన్న ఆస్పత్రి డాక్టర్లు ఉచితంగా వైద్యం చేస్తామంటే కూడా వద్దుపోవయ్యా అన్నాడు..'' అని ఆయన సంబంధీకులు చెప్పారు. అయితే, ఇలాంటి కథనాలు చదివి.. ఎవరైనా కిరోసిన్ తాగడానికి ప్రయత్నిస్తే అనారోగ్యంపాలవ్వక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. '' వెదురు బుట్టలు అల్లడం, రాళ్లను పగలగొట్టడంలో చేయి తిరిగిన చెన్ కు దగ్గర్లో ఉన్న డాక్టర్లు వైద్యం చేస్తామన్నా వద్దంటాడని ఆయన సంబంధీకులు చెప్పారు. ఇలాంటి కథనాలు చదివి ఎవరైనా కిరోసిన్ త్రాగటానికి ప్రయత్నిస్తే ఆనారోగ్యం పాలవ్వక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+