యాత్రికుల తాకిడిలో నెం.1 స్ధానం వడ్డీకాసులవాడికే...

తాజ్ మహాల్, ఎల్లోరా వంటి పర్యాటక ప్రాంతాలను కూడా అత్యధిక స్థాయిలో స్వదేశీ యాత్రికులు సందర్శించటంతో ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రా ప్రాంతాలు కూడా తొలి స్థానాలు దక్కించుకున్నాయిని కేంద్ర పర్యాటక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను 2010 సంవత్సరంలో 740 మిలియన్ల యాత్రికులు సందర్శించారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే 2009తో పోల్చుకుంటే 2010లో యాత్రికుల తాకిడి 10.7 శాతం పెరిగింది. 2009లో పర్యాటకుల సంఖ్య 669 మిలియన్లు ఉండగా, 2008లో ఈ సంఖ్య 563 మిలియన్లు మాత్రమే.
ఆధ్యాత్మికత నేపధ్యంలో దాదాపు 60 శాతం మంది పర్యాటకులు తమిళనాడులోని రామేశ్వరం, మీనాక్షి అమ్మన్ తదితర ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారని తమిళనాడు పర్యాటక శాఖ కార్యదర్శి వీకే జయకోడీ తెలిపారు. మిగిలిన 40 శాతం మంది ఆరోగ్యపరమైన సమస్యలను నివారించుకునేందుకు చెన్నై తదితర పట్టణాలకు వస్తున్నారని జయకోడీ తెలిపారు.












Click it and Unblock the Notifications