నేనే గెలుస్తా అంటే అహంకారమే: వాసుకి సుంకవల్లి
హైదరాబాద్: తాను మిస్ యూనివర్స్‌ను సాధించి తీరుతానని మిస్ యూనివర్స్ ఇండియా-2011వాసుకి సుంకవల్లి గురువారం ఆశాభావం వ్యక్తం చేసింది. సెప్టెంబరులో జరిగే మిస్ యూనివర్సు పోటీలలో భారత్ తరఫున వాసుకి పాల్గొంటుంది. ఈ పోటీలో గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతానని ఆమె చెప్పింది. తాను మాత్రమే గెలుస్తానని చెప్పడం అహంకారమవుతుందని కూడా అంది. ముంబయి నుండి హైదరాబాదు వచ్చిన వాసుకి సుంకవల్లి విలేకరులతో మాట్లాడింది.
కాగా వాసుకి సుంకవల్లి ఐదు రోజుల క్రితం ముంబయిలో జరిగిన ఐయామ్ షి టైటిల్‌ను గెలిచిన విషయం తెలిసిందే. వాసుకి వయస్సు 26 ఏళ్లు. దక్షిణాది నుండి మిస్ యూనివర్సుకు వెళుతున్న మొదటి అమ్మాయి. ఈమె పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి. బ్రెజిల్‌లో సెప్టెంబర్ 12న మిస్ యూనివర్సు పోటీలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications