హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ గన్ మెన్ మన్మోహన్ సింగ్ శుక్రవారం అన్నారు. శుక్రవారం పోలీసులు విచారణ నిమిత్తం మన్మోహన్‌ను కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా మన్మోహన్ తనకు హత్యతో సంబంధం లేదన్నారు. హత్యతో తన అల్లుడిని అనవసరంగా అరెస్టు చేశారని మన్మోహన్ మామ మహావీర్ సింగ్ అన్నారు. మన్మోహన్‌ను ఉజ్జయినీలో అరెస్టు చేసిన పోలీసులు శేరిలింగంపల్లిలో అరెస్టు చేసినట్లు చూపిస్తున్నారని ఆరోపించారు.
ఆయన కుటుంబానికి మన్మోహన్ ఒక్కడే ఆధారం అని అన్నారు. అతనికి బెయిలు మంజూరు చేయాలని కోరారు. ఆతని తల్లిదండ్రులు పూర్తిగా వృద్ధులను వారికి ఆధారంగా ఉండేందుకైనా ఎలాంటి తప్పు చేయని మన్మోహన్‌ను విడుదల చేయాలని కోరారు.