న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడు నితన్ గడ్కరీ కుమారుడు నిఖిల్ గడ్కరీకి చెందిన కార్యాలయంలో ఆదాయం పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీలో నిఖిల్ గడ్కరీ ప్రధాన వాటాదారుడు. గుజరాత్‌కు చెందిన కంపెనీలో ఇటీవల ఐటి దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో నిఖిల్ గడ్కరీకి ప్రధాన వాటాదారుడైన నాగపూర్‌కు చెందిన అంకుర్ సీడ్స్ నుంచి ఆ కంపెనీకి పెద్ద యెత్తున పెట్టుబడులు వచ్చాయి.
నిఖిల్ గడ్కరీకి చెందిన కంపెనీలో ఐటి శాఖ సోదాలు చేసిన విషయంపై బిజెపి నాయకులు మౌనం పాటిస్తున్నారు. ఇప్పుడు దానిపై తాము ఏమీ మాట్లాడదలుచుకోలేదని, మామూలుగా జరిగే వ్యవహారంలో భాగంగానే ఈ దాడులు జరిగి ఉంటాయని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అన్నారు.
Income Tax officials carried out searches at the premises of a company in which Nikhil Gadkari, son of BJP president Nitin Gadkari, is a significant shareholder.
Story first published: Friday, July 22, 2011, 11:18 [IST]